Thursday, May 30, 2024

అవకాశవాది తేదీ-28-07-23 శీర్షిక - గో పి

 అవకాశవాది 

తేదీ-28-07-23
శీర్షిక - గో  పి 

పంచతంత్రంలో కరటక దమనకులకు 
పవిత్రమైన వారసులు ... 
పక్కవాడి కష్టం పట్టించుకోని తత్వం 
తన పని అయినదా లేదా అన్నదే సత్యం ... 

ఎదుటివాడు ఏ గంగలో పోయినా సరే…
ఏరుదాటగానే తెప్ప తగలపెట్టే రకం 
ఆత్మీయతలంటే స్వంత లాభానికి
అనుబంధాలంటే స్వీయ క్షేమానికి…. 

అమ్మయినా నాన్నయినా 
అక్కర చూసుకునే మనస్తత్వం..
బంధువయినా మిత్రుడయినా 
మన బాగులు కోరినంతవరకే ... 

అరటాకుమీద ముళ్ళు పడినా  
ముల్లు  మీద అరిటాకు పడిన చందమే 
మీ ఇంటికి వస్తే ఏమిస్తావు
మా  ఇంటికి వస్తే ఏమి తెస్తావు … 

ధవళవస్త్రదారులు దండుకునే రహదారి 
కండువాలు మార్చినా మండువాలు మార్చినా 
కారణాలు ఏమైనా స్వార్థాన్ని వీడేది లేదు… 
నాలుగొద్దులు కూలిచ్చి ఐదేండ్లు రాజ్యమేలుతారు 
సుక్కముక్కలు నీకిచ్చి వెర్రివాన్ని చేసి 
వేలకోట్లు వెనకేస్తారు తరాలకు సరిపడ.. 

గురువులైనా పంగనామమే 
శిష్యులైనా దొంగజపమే 
గోపిగా ప్రముఖమే సంఘంలో
అధికారమైతే  ఆబగా రావాలి 
బాధ్యతలైతే బలాదూరు తిరగాలి ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment