కాకమ్మ కథలు
తేది : 20-08-2023
శీర్షిక : నేర్పరి జాణలు
పుట్టుకతో కొంత మందికి
పుణికి పుచ్చుకునేది మరికొంత మంది...
ఏ సమయమైనా ఏ సందర్భమైనా
స్వాధీనంలోకి తెచ్చుకుని సక్సెస్ మంత్ర
బాటలలో పయనమవుతుంటారు .....
అపాయాలను తప్పించుకొనుటకు
ఉపాయాల వెదుకులాటలో
అవసరార్థం అప్పటికప్పుడు
అల్లుకునే కథలు కమామీషు ....
కానీ కొందరు అదేపనిగా
బాధ్యతలను బలాదూరుగా
గాలికి వదిలేసి .... కథలు
అల్లడంలోనే నైపుణ్యం ప్రదర్శిస్తారు ...
కార్యాలయాలలో కిందివారితో
పనిచేయిస్తూ .... పై వారికి
మస్కాలు కొడుతూ కాకమ్మ
కథలతో కాలక్షేపం చేసేవాళ్ళు
అనేకులు
కండువాలు మార్చుకున్నా
కారణాలు అవతలి వారికి ఆపాదించి
దులిపి దుమ్మెత్తిపోసి
చేతులు దులుపుకోవడం ....
అందుకే నేటి రోజులలో ఆ నేర్పరి
జాణల కళ్ళు కప్పి అయినా సరే
అడుగడుగున అప్రమత్తంగా
అడుగులేయకపోతే .... ఆపదలు
కొని తెచ్చుకునే ప్రమాదమే ....
తస్మాత్ జాగ్రత్త ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment