నేరం - శిక్ష
తేది 05-07-23
శీర్షిక: ఎంత చెట్టుకు అంత గాలిలా…
జీవరాశిలో మిన్నంటూ లెక్కేసుకునే
మనిషి... భావరాశిలో సున్నని
అప్పుడప్పుడు దాఖలాలు దండిగా
విసురుతూనే ఉంటాడు అలసత్వాలతో ...
రాజుగారి పాలల్లో రాటుతేలిన
జనం రంజిల్లి పొసే నీళ్లలా వ్యవహరిస్తే…
ఎంత చెట్టుకు అంత గాలిలా
నేరాలకి తగిన శిక్షల ఖరారు కావాల్సిందే…
శిక్షలు బాధ్యతలు తప్పి షికారుకెళ్తే
నేరాలు భయం లేని కోడి బజారులో
గుడ్డు పెట్టినట్టుగా… బరితెగించి
గానా బజానా చేసేస్తుంది..
సంఘజీవిగా స్వచ్చంద చలామణిలోనే
స్వీయ నియంత్రణల చిట్టాలు..
నియమనిష్టల నిశ్చితార్థాలు
కనుసన్నలలో కవాతు చేసే కట్టుబాట్లు..
అన్నీ ఇమిడి ఉన్నాయి…
రాజకీయపు రంగుల జెండాలో ..
అధికార దుప్పుల తప్పుడు బలాలో…
డబ్బు జబ్బుల రుగ్మతలో
రాబందుల మూర్ఖపు బలగాలో…
రాకూడదు ఏకోశానా అడ్డుగా…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment