మునిగి తేలాలని ఉంది
తేది : 09-08-2023
శీర్షిక : హంసవాహిని సేవలో ....
జీవరాశిలో వైవిధ్యమైన
మానావళిగా మనుచున్నందున
ఆత్మీయపు వేర్లతో అనురాగపు
కొమ్మారెమ్మలతో అనుబంధాల
పరిమళాలు వెదజల్లే అవనిపై
తరువై వెలుగొందాలని ....
విజ్ఞానాల వివేచనల
విఖ్యాతంలో మేటినని
మీటడమే కాకుండా ...
స్వచ్ఛమైన నీరులా
సరళమై ఉపయోగపడే
నరునిగా మిగలాలని .....
మంద బుద్దులనుకునే
పశుపక్ష్యాదులు సైతం
తమ తమ జాతుల
సంతులనాలలో తల
మునకలౌతున్నాయి
మనకు గుణ పాఠంగా .....
ప్రకృతిని ఆవహించుకుంటే
పల్లవి ఎత్తుకోవడంలో
పరిపాటిగా మనకు వంత
పాడి...చరణాలకు దాసులను
గావించి హంసవాహినికి
అక్షర నివేదనలతో హారతులిచ్చి
ఆ తల్లి సేవలో అలితేరాలని
ఉంది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment