నీవు నేర్పిన విద్యయే…
తేది 23-08-2023
శీర్షిక : భ్రమల ఊరేగింపు..
సహస్రాధికం…
సంద్రములో నీటిబొట్టులా
సవాలక్ష తోలుబొమ్మల్లో
ఒకరిగా ఆటలో పాత్రలమై ...
అంతా నేనననే భ్రమలో
బ్రతుకుతున్నాము ...
ఆనంద పరవశాల సంకేతంలా
అరమోడ్పు కన్నుల అలౌకికమై
అరచేయి తలకానించి…
చిద్విలాసమయ్యాడంటే
అసలు ఆట మొదలైనదని సూచన ...
పాలల్లో నెయ్యిలాగా తాను
కంటికి కనిపించడు కానీ...
బొమ్మను చేసి ప్రాణం పోసి
ఆటను నేర్పించి ఆడించేది
ఆడిస్తున్నది అంతా తానే గదా …
కణికట్టుల మహిమాన్వితునిలా
కనుసైగలతోనే కదిలిస్తాడు
చిరునవ్వులతోనే మందలిస్తాడు
మనోనేత్రంతో మతలబేంటో
కనిపెట్టగల ధీశాలి .....
మనమంతా భ్రమల ఊరేగింపులో
మునిగి తేలుతుంటే .... తాను
మాత్రం స్వయంచలితలా .....
తమపర భేదమెరుగక...విద్యుక్త
ధర్మంలా నిర్వహిస్తుంటాడు ....
అదే గీతాచార్యుని గురు బోధన ...
పరంధాముడు మనకందించిన
హైందావాన నిలిచిన అమూల్యం ....
విశ్వహితమైన జీవన లక్ష్యం బోధించే
అనన్యం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment