స్వేచ్ఛ భారతం
తేది : 15-08-2023
శీర్షిక : చైతన్య జ్యోతులు
వలస వాదుల రాక్షసత్వాలకు
కళ్లెమేయాలని కలబడిన తెగువ ....
ప్రాణాలను ఫణంగా పెట్టిన నైజం
ఆంగ్లేయుల గుండెల్లో అలజడి
సృష్టించిన వైనం .....
శతాబ్దాల తరబడి శంఖమూది
ప్రజలలో చైతన్య జ్యోతులు వెలిగించిన
వ్యూహం ....గమనం జోడించి
గమ్య తీరాలను చేర్చిన గణం ....
ఏకరువు పెడితే భీకరమే ....
సింహంలా గర్జించిన శివాజీ
పులిలా గాండ్రించిన ఝాన్సీ...
స్వాతంత్య్రం నా జన్మ హక్కు అన్న
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ...
మీ నెత్తురు నాకు ధారపోయండి
స్వాతంత్య్రం సాధించి చూపెడతానన్న
సుభాష్ చంద్ర బోసు ....
తూటాలను గుండెకు గురి
చూపిన ఆజాద్ చంద్రశేఖర్
ఉరితాడును ముద్దాడిన
భగత్ సింగ్ ... ఎందరో
మహానుభావులు అందరికి
వందనాలు ....
ఊపిరిగా రంగరించుకున్న
వందే మాతరం....
దేహమంతా ఉడుకు రక్తం
ప్రవహింపచేసుకుని
ఉద్యమ గంధాలను
పరిమళింపజేసుకున్న దేహాలు ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment