దర్పణం--- రాఖీ ---
01-09-2024
ద్వాపారంనుండి దండిగా
ఆచరిస్తున్న సాంప్రదాయం…
అమ్మా నాన్నల ప్రతిరూపమై
అన్నదమ్ములు అండదండలన్నీ
సోదరికుండగా ...
అవనీమాత రూపమే ఆ ద్రౌపది
సోదరిగా పొందు రక్షణ కవచం
అనంతుడి అండదండ సుస్థిరమై
ఆత్మీయత అనురాగాల ధర్మమై ...
శ్రావణ పౌర్ణమి వెన్నెలరోజు
చెల్లెలిచేత అన్నలకు ఆత్మీయతలకు
అనురాగాలకు ఆది చిహ్నమై
సప్తవర్ణాల కంకణ ధారణ ...
ఒకే ఇంట జంటగా పుట్టి
ప్రేమగా
పంచుకున్న తల్లిపాల
సాక్షిగా తలచు
క్షేమాలను
నీ ప్రతిపనిలో సఫలత
సాధించాలని కోరుతూ
సాదరమై
దీవించే ఆడపడచు
ఆత్మీయంగా...
ఇంకను…అవని బోలు ఆడపడుచులు
తమంత తామై పోకుండా… సరిహద్దును
జవాను పోయి రక్షించిన చందముగా…
అన్నదమ్ములే పోయి అలుపులు లేకుండా చేసి
రక్షాబంధనం గైకొని ధైర్య వచనం నుడివిన
అది ఎంత మధురమౌనో కదా ...
No comments:
Post a Comment