Thursday, May 30, 2024

రేపటి మనిషి 04-08-2023 శీర్షిక : గీతాచార్యుడుగా…

 రేపటి మనిషి 

04-08-2023
శీర్షిక : గీతాచార్యుడుగా… 
సహస్రాధికం 

పచ్చ పచ్చని ప్రపంచంలో 
అంతానావారేననని నమ్ముకుని 
నాలుగడుగులు వేసేవరకు 
నమ్మలేని నిజాలు కంటపడుతుంటే ... 

నడిచొచ్చిన దారి వెలుగులలో 
నలుగురు మెచ్చే ఓ చక్కని రూపంతో 
రేపటి మనిషిని తీర్చి దిద్దుకోవడం 
ఈనాటి మనందరి బాధ్యత .... 

నిత్యనూతనంగా ఒక్కొక్కటిగా జీవిత
సౌకర్యాల సరంజామా సర్దుతుంటే …
నా జాతి అండదండలతో  నా పక్కన
నిలబడ్డ తీరుతో  ఓమారు మురిసిపోతుంటే ... 

అధికార దాహాలతో ఆజ్యం పోస్తున్న
ఆరని మంటల జ్వాలల కారణం అర్థంకాక ... 
అభివృద్ధి అంతా ఉత్త చెత్తని నిరుపయోగమని 
రాతియుగమే  రంజిల్లుతున్నదని స్థిమితమాయె ... 

ఉన్నట్టుండి మానసం వేగనిరోధకంతో  కుదిపిన 
వాహనంలా నిలిచిపోగానే... దిక్కులు
చూసి  పిక్కటిల్లేలా అరవాలని అనుకున్నా
గొంతు పెగలక..గోల దిగమింగలేక గోడకు 
దిగాలు పడి రోదిస్తున్నా...  

అందుకనే అన్నపానీయాలు 
మానుకుని రేపటిమనిషికి 
రూపమెలా ఉండాలనే  ఆలోచనలకు 
అంకురమైతున్నా...అవపోశన పడుతున్నా.. 

ఆరోగ్యాల పుష్టి యోగంతో 
సత్య ధర్మ నిష్ఠల పాలన ప్రతినిధులుగా 
తమపర బేధము లెరుగక సాటివారి
సమతా మమతల సాధకుడై గీతాచార్యుడుగా
నిలవాలని ఆకాంక్షిస్తున్నాను ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment