పాలు నీళ్లు
తేది : 04-08-2023
శీర్షిక : పరవశమే
పాలు నీళ్లు కలిస్తే పరవశమే
విడదీయలేని వింత బంధం ..
పాయసంలో నేయిలాగా
అన్యోన్యతలో అగ్రగామి …
సుందరతలు నిండిన
చూడ చక్కని దాంపత్యమైనా
అరమరికలెరుగని
కలిసి మెలిసిన మిత్రబంధమైనా ...
ఆదరణలే శ్వాసలుగా
ప్రజల కష్టాలను బాపంగా…
ఆపద్భాంధవులై పరిపాలించే
ప్రజాక్షేమ కారకులైన పాలకులు…
స్వార్థం భుజానేసుకుని
డబ్బు జబ్బులో కూరుకు పోకుండా
మానవతలో అంకురమై
మమతల పొదరిళ్లలో పచ్చగా
పదికాలాలు పదిలమవ్వాలి ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment