Sunday, May 26, 2024

ఆస్తులు అంతస్తులు తేది : 23-06-2023 శీర్షిక : సంతృప్తి

 ఆస్తులు అంతస్తులు 

తేది : 23-06-2023
శీర్షిక : సంతృప్తి

ఆస్తుల అంతస్తుల అలమారాలో 
అందరికి ఎత్తుకెదగాలనే తాపత్రయం....  
తమ పర బేధాలు మరిచి 
తామే గొప్పనే సంస్కారాలు ..... 

ఆస్తుల పట్టింపులు ... అంతస్థుల 
కొలమానం అంత భౌతికం ...అవేవి 
అక్కర లేని ఆనందాల తీరమే ఆత్మీయత
ఎల్లలెరుగని అనురాగం అనుబంధాలు ..... 

ఆస్తులంటే .... అతస్తులంటే .... 
కడుపుకు తినలేని నోట్లకట్టలా ? 
కమ్మని మాటకు నోచని కారు బంగళాలా ? 
కంచంలోకి ముద్ద నీయని ఒంటరితనమా ?  
కంటికి కునుకునీయని టుంగుటుయ్యాలలా ? 

ఇవి మాత్రమే .... 
అంటిపెట్టుకున్న అమ్మతత్వం 
చుట్టుకున్న నాన్నతత్వం 
కనిపెట్టుకునే ఆలి తత్వం 
మాటవిని గౌరవించే సంతానం .... 

ఏపూటకాపూట కడుపునిండా తిని 
కంటినిండా నిద్రపోగలగడమే .... 
పదుగురితో పదం కలిపి నడిచి 
ప్రత్యేకత నిలబెట్టుకోగలగడమే .... 

మాట చెబితే ప్రవచనమౌతుంది .... 
సంతృప్తితో అనుభవిస్తే కళ్ళు చెమ్మగిల్లు... 
బాకా ఊది చెప్పే లోకం తీరే ఇది ... 
బాగుపడితే  బ్రహ్మరథం .....   

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment