Wednesday, May 22, 2024

మనసులు గెలిచిన వేళ తేది :19-06-2023 శీర్షిక : అందరు బాగుండాలి

 మనసులు గెలిచిన వేళ 

తేది :19-06-2023
శీర్షిక :  అందరు బాగుండాలి
సహస్రాధికం   

అందరు బాగుండాలి
అందులో మనముండాలనే 
వజ్ర సంకల్పం ...  
స్వార్థాలను చంక దింపుకుని 
తరువులా పచ్చలు పొదువుకుంటే... 
వేల టన్నుల బరువులు మాయమై 
ఉపశమనమనాలతో పాటుగా ...
దారి చూపే వేగుచుక్కైయ్యే దాఖలాలే… 

గీత బోధనల సారాంశలా 
ప్రతిఫలాపేక్షల పట్టింపులు లేని
నీతి నిజాయితీల విద్యుక్త ధర్మ 
నిర్వహణలు ...అకుంఠిత దీక్షల 
ఆరాటం ...నియమనిష్ఠల పట్టుదలలు 
ధర్మాధర్మ విచక్షణలు ...నిత్యకర్మల 
సంలీనం...దైవరూప నిజ సందర్శనమే ..... 
 
మనిషితనపు మడి కట్టుకుని 
మానవత్వాల కుసుమరంజితములై
ఆత్మీయానురాగల ఆరాధనలతో 
అందరి మనసులు గెలిచిన శుభవేళ 
అధిరోహణమే ఆ హిమశిఖరం  .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment