Wednesday, May 22, 2024

మేఘమా ... వర్షించవూ ... తేది : 19-06-2023 శీర్షిక : తాగు నీరు -- సాగునీరు .

 మేఘమా ... వర్షించవూ ...  

తేది : 19-06-2023 
శీర్షిక : తాగు నీరు -- సాగునీరు .... 

నిప్పుల కొలిమిలా భగభగలు 
తనువున  నిలువెల్లా చమటలు ... 
ఫ్యాను పసలేనిదై పోయిందనిపించే  
కూలర్ చేతులెత్తేసి బేజారెత్తిపాయే .... 

భరణి కార్తెలో బండలు పగిలినా  ... 
కృతిక కార్తెలో కుతికలెండినా 
రోహిణి కార్తెలో  రోకళ్ళు చెదిరినా ... 
మృగశిర కరుణిస్తుందనుకున్నాం .... 

రెండు కళ్ళకు చెయ్యడ్డం పెట్టుకుని
ఆశగా నిత్యం ఆకాశం వంక చూడడం 
మా దినచర్య అయినది ...  
హాలికులంతా  నీ వైపే చూస్తున్నారు  .... 
ప్రజలంతా పబ్బతి పడుతున్నారు ... 

తాగు నీరుకు తండ్లాడుతూ ... 
సాగు నీరుకు సాగిలపడుతూ .... 
తరువులన్నీ ఎదురుచూపులే ... 
బోరు బోరున కంట నీరే మిగిలింది ... 

అక్కడక్కడా మబ్బు పట్టినా 
అనుమానం తీరినట్టు లేదు .... 
కప్పల పెళ్లిళ్లు చేయాలేమో .... 
కరుణించి కాపాడమని మొక్కుతూ ... 

అమ్మా  గంగమ్మ తల్లీ  
శివుని జటాజూటము దిగి రావా .... 
ఆదరించి  ఆనతీయవే 
జలకళతో జిగినీలు కురిపించి 
వాగు వంక తటాకములు నింపంగా .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment