Thursday, May 30, 2024

చిత్రానికి గజల్ 16-08-23

 చిత్రానికి గజల్ 

 16-08-23 
6/6/6/6 

 ప్రకృతిలో అందాలను 
నింపినదీ ఈ సుందరి 
మోహములా గమకమై 
వేచినదీ ఈ సుందరి ! 

 ధవళవస్త్ర మేలిముసుగు 
ధరించగా దేవకన్య 
అప్సరసల వరుసలోన 
మూడవదీ ఈ సుందరి! 

చూపులతో సుమబాణం 
సంధించెను మధురముగా 
హావభావ మధుకళశం 
పోలినదీ ఈ సుందరి! 

 ఇంద్రునిచే నియుక్తింప 
 విద్యుక్తము భావించెను 
తపభంగం చేయిటకై 
 కదిలనదీ ఈ సుందరి! 

 రాజఋషికి తప్పలేదు 
రమణులతో తిప్పలునూ 
వలపులన్ని విసురుతూ 
వచ్చినదీ ఈ సుందరి ! 

 నగునూరి రాజన్న

No comments:

Post a Comment