బడులు మొదలు
తేది : 08-06-2023
శీర్షిక : మళ్ళీ బడి
అమ్మమ్మ ఇంట ఆడుకున్న
అలుపులింకా తీరకముందే
బడి గంట గణ గణ మోగింది
మళ్ళీ బడికి బాట చూపిస్తూ ...
బద్దకంగా ఒళ్ళువిరుచుకుంటున్న
బాగు బూట్లు ఏకరూప దుస్తుల
గుండె ఒక్కసారిగా ఝల్లుమంది
గానుగలా మళ్ళీ తిరగాలనుకుంటూ ....
బలవంతంగా అడుగులు కూడా
తడపడుతున్నాయి ...సంతలో
సాంతం కొత్త తరగతి సరంజామా
సంపూర్తిగా అందుబాటు కాలేదని .....
కొత్త కొత్త మిత్రులతో ఆటాపాటలాడి
గెంతాలని..మైదానాలు కోటి ఆశల
కోరికల గుర్రాలెక్కి చల్ చల్ మంటూ
చలాకీగా ఎదురు చూస్తున్నాయి .....
పూర్వీకుల దూరదృష్టి ఎంతగొప్పదో ...
నిన్న మొన్నటి వరకు నిప్పుల
కొలిమిలా అల్లాడిన వాతావరణం
మృగశిరతో వగలు పోతూ మొగులు
మెత్తబడింది ....
ఆమాత్రం తొలకరి కురిసిందా ...
చల్లబరిచి సాంత్వన చేకూరుతుంది
పిల్లలకు... తల్లిదండ్రులకు .....
గురువులకు .... అందరికి .....
మళ్ళీ పుస్తకాలన్నీ తిరగేసి
మస్తకాలకు పదును పెట్టి
పిల్లలంతా పుటం పెట్టిన
స్వర్ణకాంతులీనాలని ఆశిద్దాం ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment