Wednesday, May 22, 2024

చిత్ర కవిత. 13-06-23 మిర్చి

 చిత్ర కవిత. 

13-06-23
మిర్చి

చూపులకేమో సూదంటురాయి 
రుచులలోన కలికితురాయి … 
నిగనిగల నూనె మెరుపులతో 
ఎంతవారైనను పాదాక్రాంతులే ...

శనగపిండిలోన సరిగంగ తానాలాడి
మురిపంగ మసాలాలతో ముక్కులదురగొట్టు ... 
హా హా అనుకుంటుండాగానే గొంతుదాటి
ఓహో అనిపించు మనచేత శెహబాసంటు … 

అన్ని తరగతుల ప్రజలకు ఇది
అందుబాటైన ఆహారము…
దోరగా వేయించిన దోబూచులాడు 
బంగారు వర్ణముల మర్మమై తోచు…

ప్రతి విందులోన పదిలమై నిలుచు 
మందుబాబులకేమో మహిమాన్వితమే…
చిన్నా పెద్దల కిది చిరుదరహాసమే
తెలుగువారందరికి కలికి మాలక్ష్మిలా … 

ముసురుపడుతుంటే మురిపించే మంత్రం 
చినుకు పడుతుంటే చిద్విలాసమే ….
పరిమితమై తింటే పసందులే 
అపరిమితమైతే మాత్రం అనారోగ్యం ….


నగునూరి రాజన్న 
కరినగరము

No comments:

Post a Comment