నానీలు
తేది 20-07-23
1. చెరువులు
మింగిన పట్టణం…
చేమంతుల తోటకు
మడి చేయమంది…
2. ఆలస్యమైందేమో
వాన రాకడ…
పాలకులకు పరీక్ష
ప్రజలకు గుబులు
3. గజరాజును
బంధించే ధీమా!
గడ్డి పోచలన్నీ
పేనుకుంటున్నాయి.
4. చీకటిలో
చిమ్మటలా
కొన్ని ముఖం
చెల్లని ఫ్లెక్సీలు…
5. రంగులద్దుకుని
రంగం సిద్దం…
ఓడే యుద్దానికి
అంతా సన్నద్దం…
నగునూరి రాజన్న.
No comments:
Post a Comment