Thursday, May 30, 2024

ముసుగులు తొలగాల్సిందే తేది : 25-07-23 శీర్షిక : మర్మాల పుట్ట

ముసుగులు తొలగాల్సిందే
తేది : 25-07-23
శీర్షిక : మర్మాల పుట్ట

మనిషి మొత్తంగా మర్మాల పుట్ట 
ఓ పట్టాన అర్థం కాని చిట్టా 
అనుక్షణం మారిపోయే అంతరంగం 
అనువుగా నర్తించుకునే మనోగమనం … 

విజ్ఞానాల  భాండాగారం 
వివేక వివేచనాల సమాహారం 
ఇరువైపులా పదునైనా 
ఇగురంగా వాడుకోగలిగితే
ఇంద్రలోక ప్రశాంతతలే ... 

జీవరాశిపై ఆధిపత్యంలో గెలిచినా 
అసలు సిసలైన అవగాహనలో 
అప్పుడప్పుడు మనిషి
వీగిపోతూనే ఉన్నాడు... 

అధికారాలకోసం అహర్నిశలు కొందరు 
అర్రులుచాచి అడ్డదారులు తొక్కుతున్నారు... 
తప్పుడు మార్గాలలో నిప్పుల దారి
తొక్కుతున్నారు… 

నిజాలు నిలకడమీద తెలుస్తాయన్నా…
నిస్సిగ్గుగా ముసుగులనే ఆశ్రయిస్తున్నారు…. 
గోముఖ వ్యాఘ్రాలై గొల్లుమంటున్నారు… 
తప్పుడు నడకలతో తిప్పలు పెడుతున్నారు. 

యుగధర్మమో కలిమాయలో 
సత్యయుగంనాటి ఋషిలాంటి మనిషి మారి 
కపటనాటకదారియై ఊసరవెళ్ళిలా
రంగులు మార్చుకుంటూ ఉనికి
చిరునామాలు మార్చుకుంటున్నాడు.  

నగునూరి రాజన్న 

కరినగరము 

No comments:

Post a Comment