కలిసొచ్చే కాలానికి …
శీర్షిక : సంశయం లేని సంకల్పం ….
వడ్డించే వాడు మనోడైతే చాలదా
ప్రయత్నమేమి చేయకుండానే
ఫలితాల ప్రసాదం దొరుకుతుంది..
అసలు ఓటు రాలకపోయినా
అందరిని తొక్కుకుంటూ వెళ్ళి
అధికార అందలమెక్కవచ్చు
కొందరిలా…
చాపకింద నీరులా చల్లగా చేరుకుని…
తేరుకునే లోపల చిటుక్కుమని కుట్టి
ఏమి తెలియనట్టు ఎర్రి ముఖం పెట్టవచ్చు…
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా
పడగనీడల రక్షణలుంటే చాలదా..
పరోక్షంగా గద్దెనెక్కి రాజ్యమేలవచ్చు ...
డెబ్బది ఐదేండ్ల నుండి ఎవరు ఏమి
చేయలేకపోయినా…
ఛాయ వాలాలైనా సరే చైనాను ఒక
ఆటాడుకోవచ్చు...
మనసు మంచిదైతే మాధవుడే
మద్దతైనట్టు….సంశయం లేని సంకల్పాల
బలంతో …విశ్వమంతటా వింతగా
నీరాజన హారతులే పట్టరా….
నగునూరి రాజన్న
No comments:
Post a Comment