Sunday, May 26, 2024

చిత్రకవిత తేది : 26-06-2023 శీర్షిక : ఆదిపరాశక్తి పూజ

 చిత్రకవిత 

తేది : 26-06-2023
శీర్షిక : ఆదిపరాశక్తి పూజ 
సహస్రాధికం 

అమోఘమైన ఆచారాలు 
అనన్యమైన సంప్రదాయాలు 
అనుభవాలతో మేళవించి 
అందించిన సంస్కృతి .... 

ఆషాడం మాసం అంటేనే 
ఆదిశక్తి అమ్మలను  కొలిచే కాలం ... 
అంతిమంగా చేరు గమ్యమే 
ఆరోగ్యాల ప్రాథమిక సూత్రము .... 

వారం వారం ప్రతి ఆదివారం 
ఆదిశక్తి అవతారాలైన …గోల్కొండ బల్కంపేట 
ఎల్లమ్మ తల్లులు, ఉజ్జయిని మహంకాళి, 
చిలకలగూడ మైసమ్మలు, హరి బౌలి అక్కన్న 
మాదన్నల  మహంకాళి, లాల్ దర్వాజ మాతేశ్వరి,
శాలిబండ ముత్యాలమ్మలకు….. బోనాలతో 

పసుపు పారాణీలతో పడతులంతా 
మడి ఆచారాల నిష్టలతో 
కొత్తకుండ అలంకరించుకుని 
కొరతలేని ఆరోగ్యాలకై కొలుస్తూ 
నిండుకుండ ప్రసాదంగా బొనమెత్తి ... 
పైన దీపంతో ప్రాణామోలే అడుగులేస్తూ 
అమ్మవార్లకు అర్పించి మొక్కుకుంటారు .... 

పిల్లాపాపలంతా చల్లగుండాలని 
అమ్మను ఆడపడుచుగా తలిచి 
సారె చీరలన్నీ సమర్పించి 
భక్తితో కొలవడమే భవ్యమైన సంప్రదాయం .... 



నగునూరి రాజన్న 

No comments:

Post a Comment