ఇది ఓటమి కాదు ...
తేది 24-08-2023
శీర్షిక : విలువ తెలియాలి ....
సహస్రాధికం
గిర్ గిర్ కర్ చలనా సీఖో
అన్న ప్రముఖ కవి పుంగవుని
వ్యాఖ్యానంలా ....
భయమెరుగని బంగారు బాల్యంలో
బహు తొందర అన్నీటికి
పడినా లేచి పరుగెత్తడమే ....
బుద్ధినేర్చిన బిడ్డడు సుద్దులు
చెప్పినట్టు ....సిగ్గు దొంతరలతో
బుద్దిమాంద్యాలను ముల్లె
గట్టుకుని ... ప్రయత్నాలను
పక్కదారి పట్టించి చింతించడం ....
అనావృష్టితో కొన్నిసార్లు
అతివృష్టితో మరికొన్నిసార్లు
కల్తీ విత్తనాలతో కలబడి
మందుల ధరలతో కొట్లాడి ....
ఓటమెరుగని పంటలు
వేస్తూనే ఉన్నాడు ....
రైతే రాజంటే పొంగలేదు
మద్దతు ధరలకు మద్దతు
తెలుపకపోయినా ... కుంగలేదు
ఓటమన్నది ఎరుగకనే
పోటీ పడుతూనే ఉన్నాడు
అవనిమాతకు నమస్కరిస్తూ
బిగి పంటలు తీయడానికి
దేశ ప్రజల ఆకలి తీర్చడానికి ....
వందలు వేలు అప్పుతీసుకున్న
జన సామాన్యుడు ... పస్తులుండైనా
పుస్తెలమ్మైనా విలువల
వలువలు చుట్టుకుని
ఉదాహరింపబడుతూనే ఉన్నాడు....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment