Sunday, May 26, 2024

తిరస్కారం తేది : 28-06-2023 శీర్షిక ... ఆత్మ జ్ఞానం ...

 తిరస్కారం 

తేది : 28-06-2023
శీర్షిక ... ఆత్మ జ్ఞానం ...

ఏమనుకుంటున్నావు?  మొత్తం 
నేనే ... నన్ను కాదని దాటగలవా ? 
చూద్దాం ... ఎంతవరకు పోగలవో ?.... 
ముదిరిన అహంభావం .... 

నేను లేకపోతే అప్పుడు తెలుస్తుంది 
చెమటలు కక్కుతున్నా ఒక్కణ్ణే .... 
ఎవరికీ ఏమి పట్టదు .... ఏమిటో 
ఈ లోకం ... చెదిరిన అజ్ఞానం...  

అంతా నాకే తెలుసునని 
అహంభావం ... వేరెవరికీ 
ఏమి తెలియదనే అజ్ఞానం  ... 
అసలు తనకే ఏమి తెలియదనే 
తెలియని అజ్ఞాని .... 

గీతలో చెప్పినదే ... నీ కర్తవ్యం 
నీవు చేయి ... ప్రతిఫలాన్ని 
ఆశించకు ....అసలు సిసలైన 
ఆత్మ జ్ఞానం .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment