చిత్ర కవిత
తేది -30-07-23
సహజ తరువులనేమో
తలలు కత్తిరించుతూ
బోన్సాయి మొక్కలవలె
బోడిగుండ్లను జేసిరి ....
కొట్టిపడేసిన కర్రముక్కలతో
కట్లుకట్టి ... కుట్లు వేసి ...
కృత్రిమంగా తరువు రూపమిచ్చే
కుర్రకుంకలు కుస్తీలు పట్టి టైర్లు బిందెలతో ...
నీడనిచ్చునేమో గాని
నిలుప ప్రాణాలకు గాలి
నేడ సమకూర్చు కృత్రిమ
తరువు ఓ కూనలమ్మా ....
పరాచికాలు చాన్నాళ్లు
పనిచేయవని తెలిసి గూడ
పదే పదే ప్రపంచ దేశాలన్నీ
పర్యావరణం పైన ఉపదేశాలు ...
లెక్కలు పక్కానే ప్రతి సంవత్సరం
చెట్లు నాటుతూ బొక్కసం ఖాళీ
చేస్తూ... బ్రతికినయా లేదా అని
పట్టించుకోని పాలకుల తీరు తెన్నులు ...
ఇలాగే చేస్తూ చూస్తూ పోతుంటే
ముందుతరాల మురిపాలన్నీ
ముక్కలు చేసిన ఘనత
మూటకట్టుకున్న చరిత మనదే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment