Thursday, May 30, 2024

కొత్తపల్లి జయశంకర్ గారు కవిత సంఖ్య: తేది: 06-08-2021

 కొత్తపల్లి జయశంకర్ గారు 

కవిత సంఖ్య: 
తేది: 06-08-2021
కవిత సంఖ్య : 40+4 

జయహో జయశంకర్ గారు 
జబర్దస్తీగా అడిగావు 
తెలంగాణ కావాలని 
ఆజన్మ బ్రహ్మచారిగా 
అంకితమే చేసుకున్నావు. 

తమిళ వాదం వద్దని 
తకురారు చేసినావు 
సాంబారు గో బ్యాకని 
పోరి నువ్వు నిలిచావు ... 

చిన్న చూపు చూసినోళ్ల 
భరతం పట్టినావు 
వలస వాదుల పాలనలో 
వంకలన్నీ ఏకరువు పెట్టినావు .... 

ఉన్నత చదువులు చదివినా 
ఉపకులపతిగా ఎదిగే క్రమంలో      
ఉక్కుపాదాల తొక్కిసలాటలో
ఊపిరాడని క్షణాలను లెక్కించావు .... 

అడుక్కోవడం మాకొద్దని 
అధికారం కావాలని 
సమయానుకూలంగా 
సలహాలిస్తూ వచ్చావు .... 

అహోరాత్రులు ఆరాటపడి 
తెలంగాణా కోరిక తీర్చావు 
జయహో జయశంకరుడా 
జయం జయం నీ చరితా .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment