బాంధవ్యాల భాష
తేది : 27-07-2023
శీర్షిక : కమ్మని చెమ్మ.
సహస్రాధికం.
ఆత్మీయతలు నిండిన లోగిలి
అనుబంధాలు కలిగిన వాకిలి
అపూర్వ ఘట్టాల ఆవిష్కరణలకు
ఆలవాలమైయ్యే అమేయ అంకురం ...
మననం చేసుకుంటేనే
మనసుకెంతో ఉపశమనం…
మంచికి చెడుకు మనకు
తోడునీడనే మనోధైర్యం ....ఆనాటి
అవిభాజ్యాలు…
మనసులో బంధం మాట మెదలగనే శరీరమంత
మాటల్లో చెప్పలేని ఉద్వేగానికి లోనయి
విద్యుత్తులా ఒళ్ళంతా ప్రవహించి
ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి నిలిచే
సత్తానిస్తుంది…
మనిషి సంఘంలో నడవడికలకు
కనపడని ప్రచ్ఛన్న మార్గదర్శి ...
మనిషెప్పుడూ సంఘజీవి
నలుగురితోనే జీవన పయనం...
అప్పుడప్పుడు అనుబంధాలు
మబ్బు పట్టిన వెన్నెల్లా మసకబారినప్పుడు
వానమ్మా లాంటి కన్నీళ్లతో కడిగి చూడు..
మరుగుపడిపోయిన మూలాలను తడిమితే
తగిలేది కమ్మని చెమ్మనే ...
No comments:
Post a Comment