Sunday, May 26, 2024

చిత్ర కవిత 24-07-23 మడి కట్టుకుంటే మాయమే…

 చిత్ర కవిత 

24-07-23
మడి కట్టుకుంటే మాయమే… 

అహింస అంటుంటే 
ఆట పట్టిస్తున్నారు… 
ఒక చంప మీద కొడితే 
మరోచంప చూపిస్తే వాయించే 
రోజులొచ్చాయి… 

కలి మాయలేమో కాని కాలమేమో
మడికట్టుకుని కూర్చుంటే 
మాయంచేసే రోజులు బిడ్డా…. 
మా తాతలు నేతులు తాగారు 
వాసన చూసి వరుసలో కూర్చోబెట్టమంటే 
మనిషినే మటు మాయం చేసే రోజులొచ్చాయి… 

అధికారాలకోసం కొందరు 
అర్రులుచాచి అడ్డదారులు 
తొక్కుతున్నారు... తప్పుడు 
నడకలతో తంపులకు దిగుతున్నారు. 

తాగి తందనాలాడుతూ 
వావి వరుసులు మర్చిపోయి 
ఆడదంటే అమ్మనే విషయం 
మరిచి ఆడ బొమ్మను చేసి 
విషం చిమ్ముతున్నారు. ……. 
తమాషాలు చేస్తున్నారు... 
చూస్తున్నారు ... 

ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా  తిరిగేతేనే 
అసలు సిసలైన స్వాతంత్రమన్నాను. 
అధికారం కోసం ఆరాటాలే తప్ప 
అంగడిబొమ్మను చేస్తారనుకోలేదు ... 

అందుకోవమ్మా నాచేతి కర్ర
ఊతంగా మలుచుతకుని
ఊచలు లెక్కపెట్టించు… తప్పుడు
నడవడికల మనుషుల లెక్కలు 
సరిచేయమ్మా…. 

No comments:

Post a Comment