చంద్రయాన్
తేదీ - 15-07-2019
శీర్షిక - ముద్దుల మామయ్య
సంఖ్య -
వచ్చేశాము మామయ్య ....
మా ముద్దుల మామయ్య…
అమ్మతోడ పుట్టావని
పురాణాల సాక్షిగా ....
అందరికి మామయ్యగ
ఆమోదం పొందావు ...
అమ్మ నోట పాటలలో
చల్లని జాబిల్లివి నీవు ...
వేల మైళ్ళ దూరమైనా
పాల బువ్వ తినిపించావు ....
వచ్చేశాము మామయ్య ....
మా ముద్దుల మామయ్య…
అలకలలో నీవైపే
ఆశగా చూసాము ....
పండువెన్నెల పంచంగ
మోదములే ప్రేమికులకు ...
శుక్లములో వృద్ధి చెంది
పున్నమిగా మురిపించి
కృష్ణంలో క్షీణించి
అమావాస్యగా బోధించావు...
వచ్చేశాము మామయ్య ....
మా ముద్దుల మామయ్య…
చెట్టుకింద ముసలమ్మను
రాట్నంతో చూపించి
పిండిలాంటి వెన్నెల్లో
మరక భ్రమ కలిగించావు
నిజాలను నిగ్గుదేల్చ
నిక్కముగా చేరి నాము ....
నీ గురించి లోకానికి
నచ్చచెప్పే నమ్మికకు....
వచ్చేశాము మామయ్య ....
మా ముద్దుల మామయ్య…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment