పిల్లి
తేది : 08-08-2023
శీర్షిక : పెద్ద విజ్ఞాని ....
పెంపుడు జంతువుగా
పేరొందిన పెద్ద విజ్ఞాని ....
గాలికి తిరిగినా ...గార్వాలు పోతూ
యజమాని చుట్టూ తిరుగుతూ
కడుపు నింపుకునే కడు నేర్పరి ....
నిమ్మళంగా నింపాదిగా నడుస్తూ
తటపటాయించకుండా తన
ఉనికిని బయటపడకుండా
నిలువునా వేటాడు మూషికాలను
కొంతమంది నాయకులలా ....
పరదేశాలలో పట్టుపరుపులే
పడుకోవడానికి ... కోట్ల ఆస్తులు
కొదువలేని సంపదలతో
పన్ను కట్టని కోటీశ్వరులే ....
ఏడిండ్లు తిప్పయినా సరే
ఏడిపించే తండ్రి పిల్లి కంటపడకుండా
పిల్లలను కనిపెంచడంలో
అండపిండ బ్రహ్మాండంగా
అచ్చమైన తల్లి పాత్ర పోషిస్తుంది ....
క్యాట్ వాక్ ల పేరుమీద
అనేక కోర్సులను పొందుపరిచి
అందాల సుందరిలకు పాఠ్యాంశమై
అలవోకగా అందించు కిరీటాలు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment