ఇక్కడి చెట్ల గాలి
తేది : 22-08-203
శీర్షిక :
భీమా లాంటి ధీమా
సహస్రాధికం
ప్రకృతే పరమోన్నతమన్న
సంస్కృతి హైందవమున ....
పట్టినా ముట్టినా పబ్బతే
సదాచారాల సత్సంప్రదాయం ....
ఉత్తర భారతంలా ఉరుములు లేవు
కోస్తా ప్రాంతంలా తుఫాన్లు రావు
రాయలసీమలా రాతి నేల కాదు
రాజ ఠీవి సంతరించుకున్నరత్నాల
రాశి... కోటి రతనాల వీణ నా తెలంగాణా ...
సరిగమపదనిస సరాగాలు పలికే
సమశీతోష్ణస్థితులతో సంతులితం
సలలిత సంధ్యా సమయములను
సమున్నతమై చూపే సందోహం .....
ఇంటింటికి ఇంతులచే
పూజలందే ఓషధీగుణాల తులసి....
నిట్టండలలో దట్టమైన నీడతో
ఆహ్లాదాలను కానుకిచ్చే వేప ...
అత్యధిక ప్రాణవాయువులను
అలవోకగా జీవరాశికి అందిస్తూ
ఆధ్యాత్మికతలు సంతరించుకున్న
అరుదైన తరువులు...రావి..
దశాబ్దాల తరబడే కాదు శతాబ్దాలైనా
చెక్కుచెదరని వటవృక్షం .....చల్లని
నీడనిచ్చే మర్రి... .
ఒక్కటేంటి అన్నీచెట్లు తోడు నీడే
భీమా లాంటి ధీమానే... జీవితాంతం
జీవితం తదుపరి కూడా ....
పత్రం పుష్పం ఫలం తోయంలా
ప్రాణాలు నిలిపేటి పత్రహరిత సంజాతలే ...
ప్రాణదానం చేసేంత గొప్ప మాతృమూర్తులే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment