Wednesday, May 22, 2024

చిత్ర కవిత తేది .12-06-23 శీర్షిక : తుళ్ళింతల తూనీగమ్మ… (నీళ్ళల్లో తన్నగానే చినుకులు ఎగిరే చిత్రం )

 చిత్ర కవిత 

తేది .12-06-23
శీర్షిక : తుళ్ళింతల తూనీగమ్మ…

తుళ్ళింతల తూనీగమ్మలా
ఆటా పాటల బాల్యం 
మధుర తేనియలను గ్రోళే భ్రమరంలా 
ఆనందాల దరహాసం..

పవన వీచికల మల్లెతీగలా
బుడి అడుగుల పయనం…
మావి చిగుళ్ళు తిన్న మత్త కోకిలై
బడి బాటపట్టిన వైనం … 

కొత్త కొత్త స్నేహితులతో 
కొదువలేని ఆనందాలు…
ఊహలలోనే ఊయలూగే 
తన్మయత్వాల సంతోషాలు ...

కాలగమనంలో కచేరీలా మృగశిర కార్తెలో
మొగులు మెత్తబడి మబ్బులకు చిల్లులే…
చినుకు ముత్యాలు  చిలకరించగానే 
అవనిమాత పచ్చంచు పైట వేసుకుంది… 

అందమైన సుందర బాల్యం 
మళ్ళీ మళ్ళీ అందుకోవాలనే 
మనందరి మదులలో మెదిలే 
మధురమైన చిలిపి కోరిక…

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment