రథ యాత్ర
తేది: 20-06-2023
శీర్షిక : అంగరంగ వైభవం
ఆషాడ శుద్ధ విదియ నుండి
ద్వాదశ దినముల దండి యాత్ర
లక్షల జన సమక్షంలో
సంభ్రమాశ్చర్యములే ....
సర్వశ్రేష్టం సమున్నతం
విశ్వవిఖ్యాతం జగన్నాథ
బలభద్ర సుభద్ర రథయాత్ర
పుణ్య క్షేత్రామైన పూరీలోన ....
అంగరంగ వైభవం
అగణిత శోభాయమానం
అంతర్జాతీయంగా నూటెనిమిది
దేశాలలో ఎల్లెడలా ....
తెలుపుగుర్రాలతో తేలియాడుచూ
పదహారు చక్రాల పవిత్ర రథం ....
ఎరుపు పసుపురంగుల అలంకరించుకుని
జగన్నాథుడే నందిఘోష పై నడయాడు....
నలుపు గుర్రాలపై నడయాడుతూ
పదునాలుగు చక్రాల ప్రమోద రథం ...
ఎరుపు నీలి ఆకుపచ్చ రంగులతో
బలభద్రుడు తలధ్వజపై తరలి కదులు ....
ఎరుపు గుర్రాలపై ఎదలన్నీ నింపుతూ
పన్నెండు చక్రాల దర్పదలన పై
ఎరుపు నలుపుల వర్ణాలతోడ
సుభద్రమ్మ సుందరమై కొలువుదీరు...
ఏ రథయాత్రలలోనైనా రాజసమే
దంపతులు కొలువయ్యి ఊరేగుతూ ...
ధగధగల దర్శనములు దండిగాను
ధరణిలోన ప్రశస్తములై ప్రజలందరకు ....
ఇచ్చోటనే తోరమై నిలిచేను
తోబుట్టువుల రథయాత్ర...
నగరవీధులన్నీ మారుమ్రోగంగా
కన్నుల పండుగే కలియుగాన ....
సర్వేజనాః సుఖినోభవంతనే
సత్సంప్రదాయ ఆచారాలు
ఆచార సంప్రదాయలన్నియు
అగ్రశ్రేణి శాస్త్రీయత మనదేశాన ...
అగ్రశ్రేణి శాస్త్రీయత మనదేశాన ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment