చిత్ర కవిత
తేది: 20-08-2023
శీర్షిక : ఫణంగా పెడుతున్న ప్రజా ఆరోగ్యం ...
పేదవారి పెన్నిధి కదళీఫలం
ధనికుల దమయంతి సేపులు
అందని ద్రాక్షలు తీయన ....
ఇనుపధాతువును కలిగిన ఇగురమైన పండు ....
జలుబు జ్వరాలు దూరం బత్తాయి ,
కంటి చూపులకు ... ఒంటి నొప్పులకు సపోటా ,
ధమనుల కొవ్వును కరిగించే దానిమ్మా ,
రక్త ప్రసరణల నియంత్రిని పుచ్చపండ్లు ,
నోరూరించే రకరకాల పండ్లు కూరగాయలు ...
సహజమైన పంటలైతే
తాజా తాజా ఫలములు
సప్త వర్ణాలతో సందడి చేస్తూంటే
నోటిలో లాలాజల తటాకమే ....
ప్రజా ఆరోగ్యాలను ఫణంగా పెడుతూ
ఇప్పుడన్నీ కార్బోలిక్ రసాయనాలతో
కృత్రిమంగా పండిస్తూ .. కుళ్ళకుండా
మైనం పూతలతో కుదేలు చేస్తున్నారు ...
రసాయనాల రసాలు నింపుకుని....
హార్మోన్లు అధికంగా వాడి పండిస్తున్న
పట్టణం మార్కెట్లో పండ్లను కూరగాయలను
పాలను చూస్తూ .... తినకుండా ఉండలేక ....
ఆనందంగా తిని ఆస్వాదించలేక .....
సతమతమే సగటు మనిషి ఈనాడు ....
పట్టీ పట్టని ప్రభుత్వాలు
ఇప్పటికైనా కల్పించుకుని
మోతాదులు నిర్ణయించి ప్రజారోగ్యాలు
కాపాడవలసిన బాధ్యత .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment