Thursday, May 30, 2024

మంగళం జయ మంగళం మా నల్లనయ్యకు మంగళం //2// 01-08-2023

 మంగళం జయ మంగళం 

మా నల్లనయ్యకు మంగళం //2//
మంగళం జయ మంగళం 
మా కృష్ణ స్వామికి మంగళం.  //2// 

మంగళం జయ మంగళం 
మా నల్లనయ్యకు మంగళం 

1. శిరమునందున మెరయుచుండెడి 
నెమలిపించకు మంగళం.  //2
శ్యామలాంగుని కరములందలి 
మధురమురళికి మంగళం…. //2//


మంగళం జయ మంగళం 
మా నల్లనయ్యకు మంగళం 
మంగళం జయ మంగళం 
మా కృష్ణ స్వామికి మంగళం. 

మంగళం జయ మంగళం 
మా నల్లనయ్యకు మంగళం 

2. వనజదమ్మును ధిక్కరించెడి 
వదనశోభకు మంగళం 
కరుణరసమును చిందుచుండెడి 
కన్నుదోయికి మంగళం

మంగళం జయ మంగళం 
మా నల్లనయ్యకు మంగళం 
మంగళం జయ మంగళం 
మా కృష్ణ స్వామికి మంగళం. 

మంగళం జయ మంగళం 
మా నల్లనయ్యకు మంగళం 

3. బ్రహ్మచే పూజింపబడిన 
చరణయుగళికి మంగళం …
జగములన్నియు కన్నతండ్రగు
చక్కనయ్యకు మంగళం… 

మంగళం జయ మంగళం 
మా నల్లనయ్యకు మంగళం 
మంగళం జయ మంగళం 
మా కృష్ణ స్వామికి మంగళం. 

మంగళం జయ మంగళం 
మా నల్లనయ్యకు మంగళం 

4. గోపికా గణ సేవితుడు 
శ్రీ గోవిందునకు మంగళం 
రాధికా పరివేష్టితుండౌ 
రస రమ్యునికి మంగళం …

మంగళం జయ మంగళం 
మా నల్లనయ్యకు మంగళం 
మంగళం జయ మంగళం 
మా కృష్ణ స్వామికి మంగళం. //2//

మంగళం జయ మంగళం 
మా నల్లనయ్యకు మంగళం //2// 

No comments:

Post a Comment