మృగశిర కార్తె
తేది: 08-06-2023.
మృగశిర కార్తె వచ్చింది
మురిపాలెన్నో తెచ్చింది
మెత్తని కాలం ఇచ్చింది
మేఘం మెల్లగా తొంగింది
ఉరుములు మెరుపులు ఇచ్చింది
వర్షపు జల్లు కురిసింది
అవని మాత పులకరించింది
పచ్చగా దుప్పటి కప్పింది ....
కనులకు ఆనందం దక్కింది
మనసంతా ఎంతో మురిసింది ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment