హాయి గొలిపే పచ్చిక బయళ్ళు
హోయలోలికే స్వచ్చ సెలయేళ్ళు
కనువిందుచేసే పర్వత పంక్తులు
కంచుకోటల లోయలు… ఒకప్పటిమాట..
అత్యవసరాలను అధిగమిస్తూ
అవసరాలకు అందిపుచ్చుకుంటూ
విలాసాలకు వింతగా ప్రవర్తిస్తూ
స్వార్థాలను చంకనేసుకుంటున్న
మానవాళితో మచ్చనే ప్రకృతికి ఎప్పుడైనా…
పొంచిన ప్రమాదాలను
పసిగట్టిన ప్రపంచదేశాలు
దశాబ్దాలనుండే రకరకాల
ప్రతిపాదనలతో ఊదరగొడుతూనే
ఉన్నారు...
రాజుగారి పాలబిందెలో
తలో చేయి వేయగానే
కనుమరుగైన పాలలా
కానరాని ఫలితాలే ప్రపంచాన ...
కాగితాలమీద ప్రణాళికలు
కాకుండా... కూసింత మనసుపెట్టి
స్వార్థాలను సంకదించి
సవ్యమైనదిశగా అడుగులు వేస్తే
సాధికారమవదా సాఫల్యత ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment