నిశ్శబ్దాన్ని నిలువునా చేధించండి
June 2023
ఎయిడ్స్ వ్యాధిని అరికట్టాము
నిశ్శబ్దాన్ని నిలువునా ఛేదించి ....
ఏదైనా చేయగలమని నిరూపించండి
ఎలాగైనా చేయాలని కంకణం కట్టుకోండి....
నిశ్శబ్దాన్ని నిలువునా చేధించండి
ఇకనైనా నోరు తెరవండి ....
అల్లుడి రాకవరకు అమావాస్య ఆగదు.
ఎక్కడ మొదలు పెట్టాలో అంటూ ...
ఎలా చెప్పాలో అనుకుంటూ ....
కాలాతీతం కానివ్వనీకండి .....
చాపకింద నీరులా మొదలయింది
ఉప్పెనలో బందీ అయినా ద్వీపంలా
గిలగిలా కొట్టుకుంటున్న కొసప్రాణంలా ...
కొండచిలువ చుట్టుముట్టిన ఊపిరైనది ,,,
ఈనగాచి నక్కలపాలు చేయకండి ...
కుసుమ మనోహరులైన మన పిల్లల్ని
శరీర దారుఢ్యాలతో రాటు దేలనీయండి
పొంచి ఉన్న ముప్పును విపులంగా తెలపండి ...
మంచి తెలిపి మసులుకునే ఖలేజా ఇవ్వండి...
విద్య నేర్చిన విజ్ఞానులారా
విమర్శ పెట్టి ప్రశ్నించండి ....
విజ్ఞుల మౌనం విపరీతాలకు నెలవు.
కులం మారితే ఒప్పుకొని రాజ్యాంగం
మతమెలా మార్చితే ఒప్పుకుంటుందో ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment