Wednesday, May 22, 2024

వెలుగు చీకటి తేది:18-06-2023 శీర్షిక : తోడూ నీడా .

 వెలుగు చీకటి 

తేది:18-06-2023
శీర్షిక :  తోడూ నీడా .... 

నీ వెంటే నేనంటూ ... 
నీ తోడు నేనేనంటూ ... 
అడుగడుగున అనుసరించుకుంటూ 
ప్రతీ చోటా పలకరించుకుంటాయి .... 

నాణేనికి ఇరువైపులలా 
కష్ట సుఖాల కావడి కుండలా 
కలిమిలేముల కాలంలా 
జీవితంలో భాగాలు .... 

వెలుగు పూలను  పంచే 
విశ్వ రేడయినా ... 
పిండి వెన్నెల్లు ఆరబోసే 
నిండు చంద్రుడైనా ... 
చేరలేరు ఏకకాలంలో 
విశ్వపు అంచులు సాంతంగా  .... 

అజ్ఞానాలను తరిమేయాలని 
విజ్ఞానజ్యోతి నిరంతర ప్రయత్నంలా ... 
చీకటిని ఓడించాలని వెలుగు 
వెలుగును కమ్మేయాలని చీకటి 
పోటీ పడుతూనే ఉంటాయి .... 

చీకటి ఉంటేనే వెలుగు విలువ 
వెలుగు ఉంటేనే చీకటి బాధ 
అర్థమై ... మంచినెంచుకునే 
బాధ్యత మనిషికి చిక్కుతుంది .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment