పలకరించిన తొలకరి
తేది: 24-06-2023
శీర్షిక : జీవకోటికి ఆధారభూతం
భరణిలో బండలు పగిలినా
కృత్తికలో కుతికలు ఎండినా
రోహిణిలో రోకండ్లు విరిగినా ....
ఎట్టకేలకు ఎదురుచూపులకు తెర పడింది
ఏడాదిలో పొడవైన రోజున
నింపాదిగా అవని సంప్రోక్షమై
తొలకరి చినుకు చిలికింది
చెట్టుమీది కాయ దించినట్టు
ఉన్నట్టుండి గాలిలో మార్పొచ్చింది ....
తొలి రోజుకు తోడుగా నిలిచి మలి భంగం
జరగకుండా మళ్ళీ జల్లు కురిసింది ....
అధికారపార్టీ కనుసన్నల్లో అచ్చు ల
పత్రికలున్నట్టు... భయం నీడన
బతుకు వెళ్లదీసినట్టుగ మెల్లగా కదులుతున్నది ....
బడితె పూజకు జడత పట్టినట్టు
గావుకేకపెట్టి గాలిలో ఎగిరినట్టు
దంచి కొడితే ఎంత బాగుండు ....
భూమాత చల్లబడి అంకురాలకు
తన చల్లని ఒడి నింపేది ....
ఏది ఏమైనా కాల మహిమను
కాదనలేము ...వాన మబ్బులకు
చాన చల్లబడింది .... వరసబెట్టి
వర్షాలొస్తే ... సాగునీటికి ... తాగునీటికి
జీవకోటికి ఆధారభూతం .....
No comments:
Post a Comment