కుదిరితే...
తేది -31-08-23
శీర్షిక - ముద్దాడు విజయతీరాలు.
సహస్రాధికం.
చలనమున్న కణమేదయినా చంచలమైన
పయనమే నయమనుకుంటుంది ...
మరింకెందుకు.. ? కణ సమూహాల
సౌధమైన మనుషులమే కద మనమంతా…
మరి కదలకుండా ఉంటే ఎలా ?
కుదిరితే పరుగెత్తు కాదంటే నడువు
అదీ కుదరకపోతే పాక్కుంటూనైనా
వెళ్ళు...
ప్రముఖ కవి శ్రీ శ్రీ గారి బోధన
యువత
కిచ్చిన అలనాటి గొప్ప సందేశం..
అడ్డురాని రకరకాల అంగ వైకల్యాలెన్నో
ఆటల్లో పోటీపడి ఢీకొడుతూ అజేయమై
విజయాలను సొంతం చేసుకుంటున్న
ఋజువులకు ప్రత్యక్ష దాఖలాలెన్నో…
అందిపుచ్చుకోగలిగే సవాలక్ష రకాల
సౌలతులున్నా …
నొక్కులు తీయగలిగే లెక్కలేనన్ని సాకులు
చూపించుకుంటూ…
ముఖాలు చాటేయడం పరిపాటిగా
చేసుకోకు… మనిషి లక్షణం కానే కాదు ...
అనుభవ సారాలను రంగరించుకుంటూ..
ఔషధాలను లేపనలుగా చేసుకుంటూ
కబోది కష్టాలను కడతేర్చుకుంటూ
దమన దుఃఖాలను దునుమాడుకుంటూ
విజయతీరాలను ముద్దాడ సంద్రపు అలలా
సాగిపోతూ తీరం చేరవల్సిందే ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment