Sunday, May 26, 2024

కళ్లద్దాలు 19-07-23 శీర్షిక : నివారణే శ్రేయస్కరం.

 కళ్లద్దాలు 

19-07-23
శీర్షిక : నివారణే శ్రేయస్కరం. 

వయసు పైన పడుతుంటే 
వరసగ పలకరించే వరములలో 
ఆది ముత్తైదువ… 
చత్వారమంటూ చమత్కరించుకున్నా 
చేతగాక మనం చీత్కరించుకున్నా…. 

నలుబదులు దాటాక నలుగుపిండి
తలంటులకు నలకచేరిన కళ్ళలా
మసకబారే దృష్టికి మహోన్నతమై 
పలకరించు బంధుమిత్ర సంబంధమై… 

చూపు లేకుంటే శూన్యమే అంతయు 
దాపు లేకుంటే దరిద్రమే అంతయు 
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం 
సప్తవర్ణమై సంతసాలు పంచు జీవితం…

పంట రసాయనాల వంటఫలమో… 
సాంకేతికతల సంబరములో… 
సన్నాసిలా వెంటబడి సరసమై పలకరిస్తుండే 
సందు దొరికిన చాలు చంటి పిల్లలనైనా 
కల్తీల కాలుష్యాల రక్కసి క్రీనీడలలో … ఈనాడు… 

అక్కరలేని అలంకారాలు కొన్నయితే 
అవసరాల రక్షణ కవచాలు మరికొన్ని 
అత్యవసరాల చేతికఱ్ఱల ఊతం ఇంకొన్ని
ఏది ఏమైనా ఆహార మార్పులతో చేపట్టు 
నివారణల అంత్యంత సుఖప్రదము… 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment