Sunday, May 26, 2024

జీవన లిపి తేది: 20-07-23---అనుభవాలతో మెరుగవుతూ…

 జీవన లిపి

తేది: 20-07-23
శీర్షిక :  అనుభవాలతో మెరుగవుతూ…  
సహస్రాధికం 

అప్పుడప్పుడు అక్కడక్కడ
అవరోధాలు  పలకరించినా 
అడుగడుగునా జయకేతనమే 
ఆలంబనంగా అడుగేసిన అనుభవం… 

జీవితమంటే కొందరికి 
వడ్డించిన విస్తరే అయినా 
అందరికి అన్వయించి 
అదే సామాన్యమనలేము..

బాల్యమంతా బంగారుమయమే 
పల్లెపట్టున అమ్మ చెంగునీడన ... 
సుద్దుల సద్దిముల్లె నెత్తికెత్తుకుని  
కళాశాల వాకిట కాలిడినదాక…. 

ఆ తదుపరి అసలు జీవితంలో 
అడుగిడినప్పటికీ… 
తెలీకుండానే తలలో నిండిపోయిన 
అమ్మ మాటల అక్షింతలు …

అనుభవాల తోటలోని పూటలను 
వడపోస్తూ… పరిస్థితులను బట్టి 
పద్దతులను …పద్దతులను బట్టి 
పరిస్థితులను బేరీజు వేసుకుంటూ…  

అంచెలంచెలుగా  అవగతనికొచ్చాక 
అమ్మ మాటలు చెవుల్లో ఆత్మసాక్షిగా 
అడుగడుగున ఆలంబనమై నిలువగా 
మొన్నటి మీద నిన్న.. నిన్నటిమీద నేడు
ఎప్పుడూ మెరుగవుతూ ఉంది జీవన లిపి…. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment