చేదు పాట
తేది: 19-05-2023
శీర్షిక : తప్పుల నిలదీత ....
తరాల మధ్య తప్పని తిప్పలు
అంతరమయ్యే భావవీచికలు
పల్లవిగా ఎత్తుకునే పదనిసలు
చరణమయ్యే రాగ దీపికలు ....
అచ్చు గుద్దినట్టుగా రాగమెత్తుకుంటే
ఊళ్ళో ఉండనీయని తత్వమే ఎప్పుడైనా ...
పైసాకక్కరరాని వారికి అధికారం
అప్పగించి ... ప్రశ్నిచడం మొదలెడితే ....
ఉండమ్మా బొట్టు పెడతానని
పట్టుబట్టి గద్దెమీద కూర్చుండ పెడితే....
నాలుగు కాళ్ళ కుర్చీని నందిలా
పదిలం చేసుకున్న దాఖలాలు ....
లాటరీలలో దక్కే అపజయాలలా
కోటరీలలో జరిగే కొంగజపాలతో
చాపకింద నీరులా సమస్తము
విస్తరించి విషతుల్యమే సమాజం .....
స్వార్థం తలకెక్కి తైతక్కలాడి
తప్పులను ఒప్పులకుప్పగా చూపుతుంటే
నిలువనీయని ముచ్చటలను
నిర్భయపు నీరటి నిన్ను నిలదీస్తే
జరిగే తంతంతా చేదు పాటే కదా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment