ఒంటరి గూటి పక్షి
తేది: 04-07-2023
శీర్షిక : దూర తీరం .....
సహస్రాధికం ...
మల్లె పరిమళాలు విరజిమ్ముతూ
ఆధారాల పందిరికి అల్లుకుని
ఆశలన్నీ కుప్పపోసుకుని
హరివిల్లును కట్టుకుంటే....
నమ్మకాల తోటలో విధి వక్రించి
వింత నాటకానికి తెర తీస్తేనో....
మూగపోయిన రోదనలతో
ఒంటరి గూటి పక్షులై వలపోతలే ....
ముందో.. వెనకో.. అందరు చేరుకునే
వెగటు గమ్యమే…కొంత స్వగతమైతే..
కొంత సంఘపరము.. మరికొంత
కట్టుబాట్లల కొట్లాటలో…పాలనా
విధానాల ఫలితాలో ...
విలువల వలువలు మరిచిన
పాలన విధానాలు ఆరితేరిన
యోగ్యతలను అటకెక్కిస్తూ
ఓటుబ్యాంకు రాబడులకే
ప్రాధాన్యతా పట్టం కడుతుంటే....
పురుడుబోసుకుని పున్నామ
నరకాలను దాటిస్తారనుకున్న
ఆశల పొదరిల్లు రెక్కలు కాస్తా ...
అడియాసల సంద్రాలను దాటి
సుదూర తీరమయ్యింది ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment