హాస్యం
తేది : 04-07-2023
శ్రీర్షిక: రసాలు రంగరించాలి…
విజ్ఞాన విచక్షణ వివేకాలలో మిన్నయిన
మనిషి కూడ వింతగ యంత్రమౌను…
జీవిత విజయ పయనంలో వైవిధ్యములైన
రసాలను విరివిగా అనుభవించ లేకపోతే…
నవరసాలలో నట్ట నడుమ నిలిచి
సమరసభావనలను చూపించే
సమన్యాయి హాస్యం…రసాలను రంగరిస్తేనే
మనసులు పరిమళించి మనిషికి ప్రేరణలగును…
మడిషన్నాక కూసింత కళా పోషణ
ఉండాలన్న ఓ మాటల రచయిత
భాష్యంలా ...జీవితంలో వినోదము
హాస్యం ఉండాలంటాను...ఉండాలి...
బంధాలను బలోపేతం చేసుకుంటూ
వరుసలతో పిలుచుకుని సరసమును
ప్రదర్శించి సంబరాలు జరుపుకునే
పల్లె పట్టున పరాష్కాలకు కొదువలేదు..
పారిశ్రామికతలతో పట్టుతప్పిన జీవన
విధానాలతో…పెరిగిన యాంత్రికతలతో
కొంత..సాంకేతికతలు చంకలో దూరాక
సాంతంగా మనిషిని నిస్తేజం ఆవరించింది…
నగునూరి రాజన్న
No comments:
Post a Comment