వాన పదం
01-08-2023
శీర్షిక: అమృత బిందువు.
సహస్రాధికం.
జీవరాశికే విశిష్ట వరం భూగోళం
పంచభూతముల పర్యావరణం
అంచెలంచెల కాలగమనం
అచంచలమైన వరుసక్రమం ...
నింగీ నేలల ఏర్పాటు
నీరు నిప్పుల తోడ్పాటు
గాలి నీరుల ఏమరుపాటు
జీవరాశి ఉనికికి మూలం ...
పంచభూతముల పనితీరులతోనే
సాగరాల నీరు సంగ్రహిస్తూనే
సరిజోడు మేఘమై గర్జించి
మేలైన వర్షాలతో ... పుడమి తల్లి
మేను తాను పులకరింపజేయు ...
వానపదం కనికరిస్తే అమ్మ ఒడి
అనురాగం ఒలకబోసి ఆకలి తీర్చుతుంది…
గొంతెత్తి పాడితే ఆనందభైరవే
చిర్రెత్తి అరిచిందంటే తూఫానే …
చిందరవందర చేసిందంటే సునామీయే….
వానపదం అడుగేస్తే సయ్యాటే
తొలకరికి భూమాతా పులకరించు
గిరి శిఖరముల పాయలుగా బైలెల్లి
మైదానంలో వాగులుగా రూపాంతరమై
నదీమతల్లిగా నర్తించు…
పరీవాహక ప్రాంతమంతా పచ్చలు పొదిగి
మరకతమై శోభించు…
మన ఆకలి దప్పులు తీర్చంగా
అన్న పూర్ణగా అవతరించు …
ప్రకృతిని ముట్టినా పట్టినా పబ్బతే
హైందవమున ప్రశస్తమై ...
అనాదిగా ఆచరిస్తున్న సంస్కృతే
అగ్రగామి మన సంప్రదాయం ...
మానవాళి ఆశలకు ఆశయాలకు
నాందీ పలికి నాగరికతలు నేర్పి
నవ వసంతాలకు నాడీ కేంద్రమై
అమృతబిందువై ఆదుకుంటుంది …
నగునూరి రాజన్న
No comments:
Post a Comment