Wednesday, May 22, 2024

రెక్కలు విరిగిన కాలం తేది :08-06-2023 శీర్షిక : మురిపాల మువ్వ

  రెక్కలు విరిగిన కాలం

తేది :08-06-2023
శీర్షిక :  మురిపాల మువ్వ 
సహస్రాధికం   

ఎప్పటికప్పుడు లెక్కలన్నీ 
సరిచేసుకుంటూ ముందుకు 
సాగి మురిపాలను మూటగట్టే మువ్వై 
జీవరాశిని మానవాళిని కనిపెట్టుకోవాలి .... 

తప్పటడుగులు మెల్లి మెల్లిగా 
బుడిబుడి అడుగులైతే 
మనసంతా ఆనందమే 
మానసమంతా  సందోహమే .... 

నిత్య చైతన్యశీలతలతో 
రామబాణంలా దూసుకెళ్ళాలి ... 
అంతేగాని తడబడదు ... కూడదు....  
*తప్పుడు అడుగులు* కాకూడదు .... 

యాంత్రికమై బండబారిపోతే 
నియంత్రించలేని నిశీధిని తలపిస్తుంది ... 
సాంకేతికమైనంత మాత్రాన 
సంధి కొట్టి చట్టబండలు కాకూడదు  .... 

నిన్నటి మీద నేడైనా 
నేటి మీద రేపెప్పుడైనా 
అంకురం మారాకులేయాలి 
మారాకులు మహావృక్షమవ్వాలి .... 

లోకకళ్యాణాల పచ్చని తరువై  
పురోగమనాల పుణ్యకాలమై ... 
మానవత్వాలను  పరిమళింప చేస్తూ 
ఆత్మీయతా అమృత తత్వాలను చిలకరించాలి... 
 
ఆశల హరివిల్లై... పూతావుల నెత్తావై 
సమకాలీన సగర్వంగా సంధించుకుంటూ 
సమృద్ధి సంక్షేమాల చైతన్యమై ... 
సగటు మనిషిని కూడా తట్టి లేపాలి .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment