Sunday, May 26, 2024

ప్రకృతిలో పయనిద్దాం తేది : 28-06-2023 శీర్షిక : ప్రయత్నించి చూడు ...

 ప్రకృతిలో పయనిద్దాం

తేది : 28-06-2023
శీర్షిక : ప్రయత్నించి చూడు ... 
సహస్రాధికం 

జీవరాశిలో వానవాళి మిన్నంటూ 
డాంబికాల డబ్బాలో రాళ్లు పోసుకుంటాం 
విజ్ఞానాల వీచికనని వివేకాల గని నని 
విచక్షణల వింత పక్షినని... ఒకటే రొద .... 

ఆచరణలోకొచ్చేవరకేమో 
అహంకారం వెక్కిరిస్తది .... 
అమలు చేద్దామనేవరకు 
అరకిలోమీటరు దూరముంటాము .... 

స్వార్థాల సంకేతమని ... 
పచ్చని వనాలలో పెట్టిన చిచ్చు ... 
అలసత్వాల ఆనవాళ్లేనని 
మనిషనడానికి చాలదా .... 
చెత్త చెదారాలతో నింపుతున్న 
వాగు వంకలు సెలయేళ్ళు నదులు .... 

పల్లె పట్నం అన్నీ పెట్టని కోటలైపోయాయి 
చిరిగిన పాలిథీన్ల  గోడలతో ... 
అనేకమయిన ప్లాస్టిక్కు సీసాలతో ... 
అయినా చోద్యం చూడటమే.... 

మూల నీటి వనరులను ధాటిగా 
తాగలేని దౌర్భల్యం .... 
కల్మషాలతోనే కాపురం చేస్తున్నాం 
కానీ, కాశ పూసి కడివెడు చెత్తను ముట్టం ... 

కాలుష్యపు కోరలతో కారాలు మిరియాలు 
దూస్తున్న ప్రాణవాయువులు... 
అప్పుడో ఇప్పుడో అన్నట్టుంది ... 
అయినా చలనం లేని బతుకులే .... 

స్వార్థాలను సమూలంగా పాతేసి 
అలసత్వాలను ఆవలకు విసిరేసి 
ఒక్కసారి పచ్చని ప్రకృతిలో సేదతీరుతూ 
పయనించదానికి ప్రయత్నించి  చూడు... 
మళ్ళీ కావాలనే బానిసవై పొతావు ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment