Sunday, May 26, 2024

కొత్త అర్థాలు తేది : 26-06-2023 శీర్షిక : అప్పుడప్పుడు

 కొత్త అర్థాలు 

తేది : 26-06-2023
శీర్షిక :  అప్పుడప్పుడు 
సంఖ్య : సహస్రాధికం .... 

జిహ్వకో రుచి పుర్రెకో గుణంలా 
భావసంపదల పరిమళాలు .... 
పదాల పొట్లం అదే పదిలమయినా
సమయానుకూలమై సందర్భోచితమై 
అర్థాల తీరుమారుతూ గొలుసుకట్టు 
చెరువుల నీరులా  ఆకట్టుకునును...   

ఒక ఎడబాటు మరో పడువాటులా 
తరం మారిన తండ్లాటలు 
వరం అందని నిశీధులు 
భాషా భారం భరించలేని తత్వం 
భావముంటే చాలానే సంతృప్తం .... 

రాష్ట్రాలవారీ పలు భాషలు 
ప్రాంతాల వారి మాండలీకం ... 
బాడుగ పదాల చేరికలతో 
వాడుకల తీరులో  వరుస మారు ...  

తెలుగులో గౌరవంగా రండి  అంటే 
హిందీలో ఘోరమైన దూషణ పదం .... 
సందర్భోచితంగా  సందడి చేస్తూ 
సరాగాలు వల్లించే సమయోచితం . 

అలసత్వాలతో ప్రకటన బోర్డుల్లో 
అధికారదర్పంతో ఆజ్ఞల ఉత్తరువుల్లో  
అక్కడక్కడా అప్పుడప్పుడు  ఏమి ఎరగనట్టు 
జరిగే అప్పు తచ్చులే అధికార భాషలలో ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment