చేజారనీయకు
తేది :21-08-2023
శీర్షిక : అంతిమంగా మానవతే ....
సహస్రాధికం
ఆరాటపడి సాధించేదేమిటి
పోరాటంలో పోటీపడి మొదట ....
అందుకోకుండ.... చెరువెనక చేరిన
నీళ్లకు చింతిస్తే లాభమేమిటి..
చేజారిన కుండ చెల్ల పెంకులే…
మనిషి ఎంత విజ్ఞానైనా సరే
అన్నింటా ఆరితేరలేని అజ్ఞానే...
అవసరాన సాయం తీసుకోని సందర్భం
గమ్యం చేరని గమనంలాంటిదే ....
అందని ద్రాక్ష పులుపులా ...
అందివచ్చిన అదృష్టాన్ని
అలుసుగా తీసుకున్నావో ....
చేతులు కాలాక ఆకుల్లాంటివే…
అజ్ఞానంతో అడుగులేసినా
విజ్ఞానం ఎదురొచ్చి చేయూత
అయినపుడు అందిపుచ్చుకోవడమే
అసలు సిసలైన వివేకం .....
ఏది ఏమైనా మరువకు మానవత
అంటిపెట్టుకో ఆత్మీయత
వేసే ప్రతి అడుగు అనురాగమై
చెప్పే ప్రతీ మాట అనుబంధమై
అంటు కట్టాలి .....
నగునూరి రాజన్న
కరినగరము
సమూహ సంఖ్య : 41
అంశం : చేజారనీయకు
తేది :21-08-2023
శీర్షిక : అంతిమంగా మానవతే ....
సహస్రాధికం
ఆరాటపడి సాధించేదేమిటి
పోరాటంలో పోటీపడి మొదట ....
అందుకోకుండ.... చెరువెనక చేరిన
నీళ్లకు చింతిస్తే లాభమేమిటి..
చేజారిన కుండ చెల్ల పెంకులే…
మనిషి ఎంత విజ్ఞానైనా సరే
అన్నింటా ఆరితేరలేని అజ్ఞానే...
అవసరాన సాయం తీసుకోని సందర్భం
గమ్యం చేరని గమనంలాంటిదే ....
అందని ద్రాక్ష పులుపులా ...
అందివచ్చిన అదృష్టాన్ని
అలుసుగా తీసుకున్నావో ....
చేతులు కాలాక ఆకుల్లాంటివే…
అజ్ఞానంతో అడుగులేసినా
విజ్ఞానం ఎదురొచ్చి చేయూత
అయినపుడు అందిపుచ్చుకోవడమే
అసలు సిసలైన వివేకం .....
ఏది ఏమైనా మరువకు మానవత
అంటిపెట్టుకో ఆత్మీయత
వేసే ప్రతి అడుగు అనురాగమై
చెప్పే ప్రతీ మాట అనుబంధమై
అంటు కట్టాలి .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment