సముద్ర తీరం
తేది : 23-08-2023
శీర్షిక : బారుతీరిన సంద్రపు తీరం ...
భారతమ్మ చుట్టుకున్న బహు సుందరం
బారులు తీరిన సంద్రపు తీరం
చూపరులకు అత్యంత మనోహరం
పిట్ట గూళ్లకు వినోదమై
పిల్లలకు పెద్దలకు పర్యాటకం ....
తల పట్టుకుని తన్నుకున్నా
రాని అలోచనలలా.... పరుగెత్తి
పారిపోయే అలల తీరాలు....
మైదాన ప్రాంతాలకన్నా రెండింతల
కుబేర నిల్వల కుటీరం ....
వేల లక్షల మంది జాలర్లకు
వెన్నతో కలిపి పెట్టకపోయినా
పొట్ట కూటికి లోటు రాకుండా
కళ్ళల్లో పెట్టుకునే కమ్మని ప్రదేశం ...
చిరు వ్యాపారులకు సైతం
చిత్రంగా చేయందించే తోడు నీడ ...
చల్ల దేశాలలో ఎండ పండగలకు
ఆలవాలమై విటమిన్లను పంచి
ఇచ్చే ఆరోగ్య కేంద్రం .... పిల్లా
పాపల ఆటవిడుపులకు కేంద్రం ...
పెట్టని కోటలా పట్టణాలు జనాభా
పెరిగిపోయి ... పరిశుభ్రతలు తగ్గి
కలుషితాలు పెరిగిపోయి... పరీక్ష
కాలమయ్యింది మానవాళికి జీవరాశికి ...
పరిహాసాలు కట్టిపెట్టి పరిణతితో
వ్యవహరిస్తే ...పక్కాగా సాధించవచ్చు
పరిశుభ్రతల పండగ....
ప్రజల ప్రభుత్వాల అండదండలతో .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment