Wednesday, May 22, 2024

ఆశాకిరణం తేది : 08-06-2023 శీర్షిక : సర్వే జనా సుఖినోభవంతు…

 ఆశాకిరణం 

తేది : 08-06-2023
శీర్షిక : సర్వే జనా సుఖినోభవంతు… 

వందలేండ్ల వలస జీవితాలకు 
చరమగీతమై ఛేదించె స్వాతంత్య్రం... 
అయినా వీడని గ్రహణమే 
ఆయువు పట్టైన సంస్కృతి సంప్రదాయాలకు ... 

చాప కింద నీరులా చావు తెలివుల 
ప్రదర్శనలతో యుగాలనాటి  
హిందూ చరితల సంస్కృతి 
సంప్రదాయాలకు...  దగాకోరులు 
కొందరు పూనుకుని ...  వెకిలి 
మరకల బురదలంటిస్తున్నారు  ... 

ఏ పాపపు క్షణాన మొదలయ్యిందో 
గాని....ఎన్నిసార్లు గంగలో ముంచినా 
శుభ్రమెరుగని అబ్రకదబ్రల బారిలో 
పడి గిల గిలా కొట్టుకుంటూనే ఉన్నది .... 

ఇంటిదొంగలను ఈశ్వరుడైన 
పట్టుకోలేడన్నుట్టుగా....
స్వార్ధపు సంచులు తగిలించుకున్న 
కొందరు వాదాల పేర్లతో  హిందూ 
వైదికాన్ని తప్పుపడుతున్నారు .... 


కాకులు దూరని కారడవిలో 
కరుడు గట్టిన హిందూ ధర్మవాదిగా  
కాలు మోపినాడు పెద్ద పులిలా .... 
ఆశాకిరణమే అందరికి సనాతనంతో 
పాటుగా సర్వే జనా సుఖినోభవంతనే 
నినాదం  కూడా ...నాలుగు కాలాలపాటు
నందనమై వికసిస్తుందని ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment